మీ పిల్లల్లో ఈరకం ప్రవర్తనను గుర్తించండి

0
find out my child behaviour

మీ పిల్లల్లో ఈరకం ప్రవర్తనను గుర్తించండి

సమాజ వ్యతిరేఖ ప్రవర్తన , క్రిమినల్ సేవియర్ ఉన్న వారిని విద్యాసంస్థలు కాని, తల్లిదండ్రులు కాని ఈవిధంగా ముందే పసిగట్టవచ్చు.

Advertisement

1.తల్లిదండ్రులపై గౌరవం ఉండదు. వారిపై తిరుగుబాటు చేస్తూ ఉంటారు .

2. రాత్రిళ్లు ఇంటికి లేటుగా వస్తుంటారు. ప్రతిరోజూ రకరకాల కారణాలు చెబుతుంటారు. నిజాలు చెప్పురు.

3. కాలేజీలకు తరచుగా ఏ కారణం లేకపోయినా సెలవులు పెడుతుంటారు చదువు విషయాలలో రెగ్యులర్ గా ఉండరు.

4. ఖరీదైన వస్తువులు, మోటారు సైకిళ్లు, సెల్ ఫోన్స్ కొనిపెట్టమని ఇంట్లో వేధిస్తుంటారు.

5. తరచుగా ఇంట్లో వారిని వేధిస్తూ తమకు అవసరాలకు మించి డబ్బు అడుగుతారు.

6. పెద్ద పెద్ద విషయాలలో తమకు సంబంధం లేని విషయాల్లోనూ, ఆర్థికపరంగా అప్పులు చేయడం లాంటి విషయాలలో తలదూరుస్తుంటారు

7. బ్రాందీలు, మత్తు పదార్థాలకు బానిస అవుతారు

8. చట్టాల్ని ఉల్లంఘించడానికి అలవాటు పడతారు

9.ఎగ్రెసివ్ గా ఉంటారు. కొద్దిమందితో తమ భావాలకు దగ్గరగా ఉన్నవారితో ముఠాలు కట్టి వారితో కాలక్షేపం చేస్తు ఉంటారు.

10.వీరు  చదువులో రాణించలేరు. ఏ ఉద్యోగంలోనూ ఇమడలేరు

11.రకరకాల బిజినెస్ లు తాము నిర్వర్తించలేనివి కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు.

12.అగమ్యగోచరమైన ఊహాలోకాలలో విహరిస్తూంటారు

13.అమ్మాయిలతో పరిచయాలు పెట్టుకుంటూ, ప్రేమగా నటిస్తూ వ్యతిరేకించినప్పుడు వారిపై కక్షసాధింపుకు పూనుకుంటారు

మారుతున్న సంస్కృతి సినిమాలు, టివి సీరియల్స్ ద్వారా యువతలో ఎమోషన్స్ను రేకెత్తించే ప్రయత్నమే నేడు జరుగుతున్నది, సినిమాలలో అమ్మాయిని కిడ్నాప్ చేయడం, రేప్ చేయడం, ఏడిపించడం, హత్యలు చేయడంలాంటి సన్నివేశాలు టీనేజి పిల్లలపై అమితంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలా చేయడం ఒక హీరోయిజం ఫీలవుతున్నారు.

వీటికి తోడుగా ఇంటర్నెట్ కూడా అమిత ప్రభావాన్ని చూపిస్తోంది. విజ్ఞానాన్ని అందించే ఇంటర్నెట్ వల్ల దుష్పరిణామాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బ్లూ ఫిలిమ్స్ చూడడం, చాటింగ్ ద్వారా ఆపోజిట్ సెక్స వారితో పరిచయాలు చేసుకోవడం వంటివన్నీ పరిమితి లేకుండా ఉన్నాయి. ఇవికాకుండా ఇంటర్నెట్ వల్ల అనేక ఆర్థిక, సామాజిక నేరాలు టీనేజర్లలో పెరుగుతున్నాయి

ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రులదే బాధ్యత అని చెప్పక తప్పదు.

సంఘవిద్రోహక చర్యలు, హత్యలు, కిడ్నాప్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనే యువత తల్లిదండ్రులను కూడా బాధ్యులుగా చేయాలా అనే ప్రశ్న ఇటీవల తలెత్తుతోంది. తమపిల్లల్ని సరైన పద్ధతిలో పెంచలేక పోవడం, ఉన్నతంగా తీర్చిదిద్దకపోవడం, క్రమశిక్షణ, నైతిక విలువలు లేకుండా పెంచి సమాజంలోకి వదిలివేయడం వల్ల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.

ఈ ఉన్మాదాలకు పరిష్కారాలు ఏమిటి ? పిల్లల పెంపకం పట్ల తల్లిదండ్రుల యాటిట్యూడ్ మారాలి. చట్టాల్ని కఠినంగా అమలు చేయాలి. విద్యా సంస్థల్లో పిల్లల ప్రవర్తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళల్లో ఐకమత్యం, సమస్యల్ని ఎదుర్కొనే మానసిక శక్తిని పెంపొందించే విద్యాలయాల్లో వ్యక్తిత్వ వికాస శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులకు, యువతకు గైడెన్స్, కౌన్సెలింగ్ సెల్ ఏర్పాటు చేయాలి.

తల్లిదండ్రుల బాధ్యత చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్, కాలేజీలో చర్చించడం, డబ్బు ఖర్చు చేయడానికి మాత్రమే పరిమితమవుతారు. కాని వారి గురించి పట్టించుకోరు. తల్లిదండ్రు లకు పిల్లలు సత్సంబంధాలు లేకపోతే పిల్లల్లో వచ్చే ఎమోషనల్ తెలుసుకోలేరు. చిన్నప్పుడు వారి ఎమోషనల్ ఉన్న టాలెంట్ ను పసిగట్టి అవి పాజిటివ్ ఎమోషన్స్ గా మార్చగలిగితే వారిలో అంతర్గతంగా వెలికి తీయవచ్చు. అలాకాకుండా ఎమోషన్స్ నెగెటివ్ గా మారిపోతే వాటిని గమనించక పోతే అవి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు దారితీస్తాయి. అలాంటి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లలు రౌడీలుగా, సంఘవిద్రోహులుగా, ఉన్నాడు హంతకులుగా మార్పు చెందుతాయి.

పిల్లల అవసరాలకు సరిపడేలా అన్ని వస్తువులూ సమకూర్చిన ముఖ్యం కాదు… వాటిలో వాళ్ళు చేస్తున్నారో కనిపెట్టాలి.

ఒకవేళ ఇది చదివిన వారు అధ్యాపకులైతే  మీ పిల్లలలో ఇలాంటి ప్రవర్తనను ముందే గుర్తించి వారి ప్రవర్తనలో మార్పుతేవడానికి ప్రయత్నించండి.

 

Advertisement
Related posts
TCC Halltickets 2020

TCC Halltickets 2020 Board of Secondary Education Telangana Technical Course Certificate (TCC) hall tickets available through this link. TCC  Technical Read more

Ts TCC 2020 results (technical certificate course)

TCC Technical certificate 2020 Results Telangana TCC (Technical Certificate Course ) exams held in January month.The results will be declared Read more

కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Mesha rashi february 2020 | మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు

మేష రాశి మాస ఫలితాలు - ఫిబ్రవరి మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు : 25.01.2020 నుండి 23.02.2020 వరకు (మాఘ మాసము - శిశిర ఋతువు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here