అయోధ్య రామ మందిరం పూర్తి వివరాలు

0
ayodya mandir whatsapp status

అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజా మహోత్సవం

శ్రీ శార్వరి నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ తేది ఆగస్ట్ 5 , 2020 ఉదయం 11:30 కు,

Advertisement

రామో విగ్రహవాన్ ధర్మ :

శ్రీ రాముడు ధర్మానికి ప్రతిరూపం . మనం ఈరోజు జరుపుకుంటున్న ఈ ఉత్సవం 491 (1528-2020) సంవత్సరాల ఉద్యమ ఫలితం. శ్రీరాముడు మనకు ఆరాధ్య దైవం . శ్రీరాముని జన్మస్థానం  పవిత్ర సరయు నదీ తీరంలో గల అయోధ్యా మోక్షాపురి. అక్కడే శ్రీరాముని కుమారునిచే మందిరం నిర్మించబడగా దానిని విక్రమాదిత్యుడు భవ్యమందిరంగా పునర్నిర్మించాడు. లక్షల సంవత్సరాల చరిత్ర కలిగి ధర్మానికి ఆదర్శాలకు ప్రతీకగా నిలిచినా రామజన్మ భూమిలోని శ్రీరామ మందిరాన్ని దేశ విద్రోహ దురాక్రమదారుడు బాబరు ఆక్రమించాడు. 1528 సంవత్సరంలో అతని సైన్యం ద్వారా లక్షలాది మంది హిందువులను ఊచకోత కోసి రామాలయాన్ని నేలమట్టం చేసేందుకు ప్రయత్నించాడు. గట్టి పునాదులు గల శక్తి వంతమైన రాతి స్థూపాలను , చెక్కిన శిలలను సమూలంగా కూల్చలేకపోయాడు. కానీ, శిఖరాలను కూల్చి ఆలయ గోడలపై మూడు గుమ్మటాలను మాత్రం నిర్మించాడు. ఈ చర్య హైందవ సమాజాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది.

నాటి నుండి సుమారు ఎందఱో హైందవ వీరులు రామ మందిర నిర్మాణం కొరకు 76 సార్లు పోరాటాలను చేసి వారి ప్రాణాలను కోల్పోయారు.

1984 లో పూజ్య ధర్మాచార్యుల ఆదేశానుసారం శ్రీరామ జన్మభూమి ఉద్యమాన్ని విశ్వా హిందూ పరిషద్ స్వీకరించింది. మానవీయ అశోక్ సింఘాల్ జీ నేతృత్వం వహించి ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందూ సమాజం సంఘటితమై కదన రంగంలోకి దూకింది. విశ్వా హిందూ పరిషద్ ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మహోద్యమంలో శ్రీ బాలాసాహెబ్ దేవరస్ జి , శ్రీ సదానంద కాకదే జీ , శ్రీ వినయ్ కతియార్ జీ , శ్రీ ఓంకార్ భావే జీ, శ్రీ లాల్ కృష్ణ అద్వాని జీ , శ్రీ మురళీ మనోహర్ జోషి  జీ , శ్రీ నృత్య గోపాల్ దాస్ జీ , సాధ్వి రితంబరి , శ్రీమతి సుష్మా స్వరాజ్ జీ , శ్రీ ఉమాభారతి జీ,శ్రీ కళ్యాన్ సింగ్ జీ , శ్రీ మోరోపంత్ పింగళి జీ , శ్రీ బాల థాకరే జీ తదితర ప్రముఖులు మరియు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీ లక్ష్మణయతీంద్రుల వారు, శ్రీ స్వామీ ప్రణవానంద వారు,శ్రీ జీ పుల్లారెడ్డి గారు , శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి గారు,శ్రీ క్రిష్ణానందగిరి స్వామి , శ్రీ మాతా శివ చైతన్య తదితర మహానీయులంత  శ్రీ రామ జన్మ భూమి విముక్తి పోరాటంలో పాల్గొని విజయానికి కారకులు అయ్యారు.

1984 నుంచి విశ్వా హిందూ పరిషద్ అనేక కార్యక్రమాలు చేపట్టింది. రామ జానకీ రథయాత్ర , రామ శిలా పూజలు , శిలన్యాస్ , రామ జ్యోతి రథయాత్రలు ,మొదటి కరసేవ ,రామ పాదుకా పూజలు , శ్రీ రామ విజయ మహా మంత్ర జపాలు  శ్రీరామా మహా యజ్ఞాలు , శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం , అయోధ్యలో అఖండ రామ నామ సంకీర్తన వంటి అనేక కార్యక్రమాల ద్వారా హిందూ సమాజాన్ని సంఘటిత పోరాటంగా ముందుకు నడిపించింది.  1992 డిసెంబెర్  6 వ తేదీన జరిపిన రెండవ కరసేవా కార్యక్రమంలో దేశ విదేశాల నుండి లక్షలాది కరసేవకులు అయోధ్యకు వచ్చి అక్కడ కళంకిత కట్టడాన్ని పూర్తిగా తొలగించి తాత్కాలిక రామ మందిరాన్ని ఏర్పాటు చేసి బాల రాముడిని అందులో ప్రతిష్టించారు.

ఒకవైపు ప్రజాలోందన కార్యక్రమాలు నిర్వహిస్తూనే విశ్వా హిందూ పరిషద్ ఫైజాబాద్ జిల్లా కోర్టు , లక్నో హైకోర్ట్ , సుప్రీం కోర్టు న్యాయస్థానాలలో న్యాయ పోరాటాలు సాగించింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్య రామ జన్మ భూమి హిందువులదే , అక్కడ వారు రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణ , నిర్వహణ కొరకు ” శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ” ను పూజ్య ధర్మా చార్యులు మరియు విశ్వా హిందూ పరిషద్ పెద్దలచే ఏర్పాటు చేసింది.

491 సంవత్సరాల నుండి శ్రీ రామ మందిర నిర్మాణానికి ఎదురు చూస్తున్న కోట్లాది మంది హిందువుల సంకల్పం సాకారం అయ్యే విధంగా శ్రీ శార్వరి నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ అనగా 2020 ఆగస్ట్ 5 వ తేదీన బుధవారం ఉదయం 11:30 నుండి 1 గంట వరకు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ హస్తాలతో “భవ్య రామ మందిర భూమి పూజ” కార్యక్రమము వైభవంగా జరగనుంది.

ఈరోజు యావత్ హిందూ సమాజం క్రింది కార్యక్రమాలు చేయాలి.

ఈరోజును అయోధ్య దీపావళి గా జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషద్ కోరుచున్నది.

1.మన ఇంటిని ఆలయాలను ,ఆశ్రమాలను విద్యుత్ దీపాలతో అలంకరించండి.

2. ఉదయం 10 నుండి 11 వరకు శ్రీరాముని అర్చన , భజన నామ జపం చేసి , హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి .

3. ఉదయం 11 నుండి భూమి పూజా కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా TV లో చూడండి.

4.సాయంత్రం 6 నుండి మీ గృహాలలో , ఆలయాలలో దీప జ్యోతులు వెలిగించి , బాణా సాంచ కాలుస్తూ విజయోత్సవ దీపావళి జరపండి.

5.కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పై కార్యక్రమాలు నిర్వహించాలి.

jai sreeram

అయోధ్య రామ మందిర ప్రత్యేకతలు

  • 3 అంతస్తుల్లో  161 ఫీట్ల ఎత్తులో ఆలయం ఉండనుంది.
  • పిల్లర్ల సంఖ్య 360.
  • వాస్తు శిల్పా శాస్త్రం ఆధారంగా కడుతున్నారు .
  • ఈ నిర్మాణానికి రాజస్థాన్ బన్షి పర్వత రాళ్ళను వాడుతున్నారు.
  • ప్రధాన ఆలయం చుట్టూ నాలుగు చిన్న ఆలయాలు ఉంటాయి .
  • శ్రీరాం అని రాసి ఉన్న రెండు లక్షల ఇటుకలను వాడుతారు.
  • ఆలయంలో కుడు ,రంగ్,నృత్య ,కీర్తన,ప్రార్థనల కోసం 5 ప్రత్యేక మండపాలు ఉంటాయి .
  • భూమి పూజ కోసం 100 కు పైగా నదుల నుండి నీటిని తెచ్చారు .

Ayodhya Ram mandir WhatsApp status – Click here

Content source : Vishwahindu Parishad

Advertisement
Related posts
పురాణాలు క్విజ్ | Mythology quiz

పురాణం - క్విజ్ ప్రస్తుత కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను పురాణాలను మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత మనదారిపై ఉంది. ఇలాంటి ప్రశ్నలు ,మనకి పురాణాల గురించి Read more

కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here