దుర్గామాత కృప-భక్తి కథలు| devotional stories in telugu

0
durga matha mahima

దుర్గామాత కృప | telugu stories

అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు దుర్గాదాస్. ఈయన దుర్గామాత భక్తుడు. ఈయన రోజుకో ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేసేవాడు. ఎల్లప్పుడూ ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీ ని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు.

Advertisement

దుర్గాదాస్ ఒకరోజు మళ్లారం( గాజుల పెట్టె) ను ఎత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో లో చెరువు పక్కన ఒక అమ్మాయి ( పెళ్ళైన స్త్రీ ) బిందె పట్టుకొని కనిపించింది. ఆ అమ్మాయి దుర్గాదాస్ ని పిలిచి నాకు గాజులు వేస్తావా? అని అడిగింది. అప్పుడు దుర్గాదాస్ గాజుల పెట్టెను ఒక చెట్టుకింద దింపాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎరుపు , పసుపు, ఆకుపచ్చ రంగుల గాజులను చేతినిండా వేయించుకుంది. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్ తో నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా! శివాలయం పక్కన ఒక ఎత్తరుగుల ఇల్లు ఉంది . ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్న గారు ఇస్తారు . నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెప్పింది. మా నాన్నగారికి నామీద కోపం ఉంది . మాకు అమ్మాయి లేదు అని అన్నా అంటాడు . అప్పుడు మా దేవునిగదిలో ఒక పాత కుంకుమ భరణి ఉంది . అందులో ఒక కాసు ఉంది , అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు . ఆయన కాదంటాడు , అయినా గట్టిగా పట్టుకో , కాసు తీసుకోనిదే అస్సలు వదలకు… దుర్గాదాస్ అప్పుడు సరే అని శివాలయం పక్కన ఉన్నా ఎత్తరుగుల ఇంటికి వస్తాడు.

అప్పుడు ఆ ఇల్లు చూడడానికి పెద్దదే అయినా చాలా పేదరికంలో ఉంది. ఆ ఇంటిముందర వేద విద్యార్థులు కనిపించారు. దుర్గాదాస్ ఇంటి యజమానిని పిలిచి … అయ్యా ! ” చెరువు దగ్గర మీ అమ్మాయికి గాజులు వేశాను. మీ అమ్మాయి డబ్బులు మీ దగ్గర తీసుకోమని చెప్పింది. నాకు త్వరగా డబ్బు ఇప్పిస్తే వెళ్తాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి” అని అంటాడు.

దానికి రామకృష్ణ పండితుడు ఆశ్చర్యపడి “నాకు అసలు ఆడ సంతానమే లేదు. నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు” అని అంటాడు. అప్పుడు దుర్గా దాస్…శివాలయం పక్కన రామకృష్ణ పండితులు అంటే మీరే కదా అని అంటాడు. దానికి రామకృష్ణ పండితుడు అవును నేనే అంటాడు.

దానికి దుర్గాదాస్ అయ్యా! ఎవైన గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలి… చాలా లక్షణమైన అమ్మాయిని కాదనుకుంటారా? మీరు ఇలాగే అంటారని అమ్మాయి చెప్పింది కూడా. నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే వెళ్లి నా పని చూసుకుంటాను అని అంటాడు దుర్గాదాస్.

దానికి రామకృష్ణ పండితుడు ! నాకసలు అమ్మాయిలే లేరు . ఎవరికో గాజులు వేసి నన్ను డబ్బులు అడగడం ఏంటి ? అని దుర్గాదాస్ తో వాదిస్తాడు…అక్కడ ఎదో గొడవ జరుగుతున్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు అక్కడికి వస్తారు.

దానికి దుర్గాదాస్ ..మీరు భలేవారు ! ఎంతకోపం ఉంటె మాత్రం కన్నా కూతిరిని కాదనుకుంటారా? అమ్మాయి నాతో అక్కడే చెప్పింది. మీరు ఇలా అంటారని. అయ్యా ! మీ అమ్మాయి నాతో చెప్పింది..మా నాన్న దగ్గర నువ్వు  ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని , ఎట్టి పరిస్థితుల్లో డబ్బు తీసుకోకుండా వెల్లకని, మీ పాత పూజ గదిలో కుంకుమ భరణిలో కాసు ఉంటుందని నాతో చెప్పింది ..ఆ కాసు అయినా తెచ్చివ్వండి. అంటాడు దుర్గాదాస్.

అప్పుడు రామకృష్ణుడు.. మా దేవతా మందిరం లో అసలు కుంకుమ భరణి లేనే లేదు ఇంకా కాసు ఎక్కడిది అంటాడు.

మీ అమ్మాయి చెప్పింది చూడవయ్యా? అంటాడు దుర్గాదాస్. చుట్టుపక్కలవాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒకసారి మీ దేవతా మందిరంలో కుంకుమభరణి ఎక్కడుందో చూడండి అని రామకృష్ణుడుతో అంటారు..

ఈ తతంగం అంతా వింటున్న పండితుని తల్లి పూజా మందిరంలో ఎక్కడో చిన్న మీట ఉన్నట్టు నాకిప్పుడు జ్ఞాపకం వస్తుందిరా ..ఒకసారి బాగా చూడు అందులో కుంకుమ భరణి ఉండవచ్చు అంది ఆ వృద్దురాలు.

రామకృష్ణుడికి కొద్దిసేపు వెతగాగా ఒకచిన్న మీట కనిపిస్తుంది. దాన్ని తాకగానే ఒక కుంకుమ భరణి బయటకు వస్తుంది. ఆ కుంకుమభరణిలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంది.  అప్పుడు రామకృష్ణుడు మనసులో ” అసలు ఇక్కడ కుంకుమ భరణి ఉన్న విషయం నాకు ఇంతవరకూ తెలియదు.. నా తల్లికూడా ఇంతవరకు నాకు చెప్పలేదు. ” నా తల్లికి తెలిసిన ఈ  విషయం ఆ అమ్మాయికి ఎలా తెలిసి ఉంటుందో ” అని ఆలోచిస్తాడు..

రామకృష్ణుడు కుంకుమ భరణిలో చేయి పెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది. వెంటనే ఆ కాసును భయటకు తీస్తాడు. తర్వాత ఇంకోసారి కుంకుమ భరణిలో చేయి పెడతాడు. మళ్ళీ ఇంకో కాసు వస్తుంది. ఇలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి.. రామ కృష్ణుడు ఒక్కసారిగా ఆశ్చర్యా నికి లోనవుతాడు. అప్పుడు ఆ కాసుని తన తల్లికి చూపిస్తాడు. అప్పుడు ఆ వృద్దురాలు ఇది మా తాతగారి కాలానికి చెందింది. ఈ కుంకుమ భరణిలో అమ్మవారి ప్రతిమ ను ఉంచి మా తాతగారు ఈ ప్రతిమను ప్రతిరోజూ భక్తి శ్రద్దలతో అర్చించే వారట, తర్వాతి కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను  పూజించడం మానేశారు.అని ఆ వృద్దురాలు చెబుతుంది.. అప్పుడు ఇంటివారు అందరూ ఆ పూజామందిరం నుంచి కాసులు తీసుకొని బయటకు వచ్చి..దుర్గాదాస్ నువ్ ఎవరిని చూశావో ? ఆ అమ్మాయిని మాకు చూపించవా అని అడుగుతారు..బంగారు కాసులతో బయటకు వచ్చిన రామకృష్ణుడిని చూసి ఊరంతా ఆశ్చర్య పోతారు ..

అప్పుడు దుర్గాదాస్ ఊరువాళ్ళను మరియు రామకృష్ణుడి కుటుంబాన్ని చెరువు దగ్గరికి తీసుకపోతాడు. ఇక్కడే ఆ అమ్మాయిని చూశాను అని చెబుతాడు. అప్పుడు ఆ చెరువు పక్కన ఎవరుకూడా కనిపించరు… ఆ చెరువు చూడడానికి పద్మాలతో నిండిన సరోవరంలా కనిపిస్తుంది. అందరూ కొద్దిసేపు వెతగాగా ఎవరో చెరువు లోకి వెళ్ళినట్లు అడుగులు కనిపిస్తాయి. అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం లేవు.

అప్పుడు ఊరివాళ్ళు  దుర్గాదాస్ తో  “వాళ్లకు అసలు అమ్మాయిలే లేరు , అయినా నీటికోసం ఇంత దూరం ఎవరూ కూడా రారు అని అంటారు..

అప్పుడు దుర్గాదాస్ అమ్మ దుర్గామ్మా ” వాల్లకిపుడు ఆ అమ్మాయి  కనబడితే తప్ప ఎవరూ కూడా నా మాట నమ్మరు..ఊరువాళ్ళ దృష్టిలో నేను అబద్దాల వాన్ని అవుతాను..బాధపడుతూ చెరువు వైపు , దుర్గా ..దుర్గా మాతా అని గట్టిగా మోర పెట్టుకుంటే ,, అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకి వస్తాయి.

రెండు చేతులకీ ఎరుపు,పసుపు ,ఆకుపచ్చ రంగుల గాజులు కనిపిస్తాయి. ఈ సన్నివేశాన్ని ఊరంతా చూసింది. ఊరంతా మొక్కుతారు.. అప్పుడు అందరూ చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్న అమ్మవారిని పూజించడానికి ఆ దుర్గమాతనే ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు.
అప్పటినుండి రామకృష్ణుడు వారి కుటుంబం భక్తి ప్రపత్తులతో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు. ఆ కుటుంబం ఆ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లింది.

రచయిత : పురాణపండ రాధాకృష్ణమూర్తి ( యుట్యూబ్ నుండి సేకరించిన ఈ కథ ను కొన్ని సవరణలతో రాయడం జరిగింది.)

Advertisement
Related posts
TCC Halltickets 2020

TCC Halltickets 2020 Board of Secondary Education Telangana Technical Course Certificate (TCC) hall tickets available through this link. TCC  Technical Read more

Ts TCC 2020 results (technical certificate course)

TCC Technical certificate 2020 Results Telangana TCC (Technical Certificate Course ) exams held in January month.The results will be declared Read more

కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Mesha rashi february 2020 | మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు

మేష రాశి మాస ఫలితాలు - ఫిబ్రవరి మేషరాశి ఫిబ్రవరి 2020 ఫలితాలు : 25.01.2020 నుండి 23.02.2020 వరకు (మాఘ మాసము - శిశిర ఋతువు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here