ఒక పుస్తకం విలువ…

0
Importance of a book

పుస్తకము విలువ

1వ కంద పద్యము

ధరపై జ్ఞానపు తరువై
నిరతము సత్ఫలములెన్నొ నియమము తోడన్
వరముగ జనులకు నిచ్చును
స్థిరశోభిత పుస్తకమ్ము తెలియుము సుమ్మీ!

Advertisement

2వ కంద పద్యము

తరగని విజ్ఞాన ఖనిగ
స్థిరతరమై వెలుగుచుండు శ్రేష్ఠపు రీతిన్
కరమగు సుజ్ఞానమొసగు
వరమే కద పుస్తకమ్ము వసుధను సుమ్మీ!

3వ కంద పద్యము

సుజ్ఞానము నందించుచు
నజ్ఞానపు చీకటినిక యంతము జేయున్
విజ్ఞానము భద్రపరచు
ప్రజ్ఞకు మూలమ్ము మంచి గ్రంథము సుమ్మీ!

4వ కంద పద్యము

తెలియని విషయము లెన్నో
లలితముగా తెలియజేసి ప్రవిమల రీతిన్
వలసిన జ్ఞానము నిచ్చును!
కలకాలము హితముగూర్చు గ్రంథము సుమ్మీ!

5వ కంద పద్యము

పుస్తకము మాతృ దేవత!
పుస్తకమే పితృవరుండు బుద్ధిని దెలుపన్
పుస్తకము గురువు , దైవము
పుస్తకమే స్నేహితుండు పుడమిని సుమ్మీ!

Advertisement
Related posts
కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here