పురాణాలు క్విజ్ | Mythology quiz

0

పురాణం – క్విజ్

ప్రస్తుత కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను పురాణాలను మన పిల్లలకు నేర్పించవలసిన బాధ్యత మనదారిపై ఉంది. ఇలాంటి ప్రశ్నలు ,మనకి పురాణాల గురించి ఎంతవరకు తెలుసో తెలియజేస్తాయి.

Advertisement

1)శ్రీ రాముని తల్లి పేరు?

2)దశరథ మహారాజు ఏ వంశస్థుడు?

3)విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకి నేర్పిన విద్య పేరేమిటి?

4)లక్ష్మణుడి తల్లి పేరేమిటి?

5)హనుమంతుడు ఎవరి నోటిలోకి వెళ్లి చెవిలో నుంచి ఇవతలకు వచ్చాడు?

6)రావణుడి భార్య ఎవరు?

7)రావణుడు ఇంకొక స్త్రీని బలాత్కరించిన అతని తల నూరు చెక్కలవుతుందని శపించింది ఎవరు?

8)బంగారు లేడీ రూపంలో వచ్చిన రాక్షసుడు ఎవరు?

9)సీతా స్వయంవరంలో రాముడు విరిచిన విల్లు పేరేమిటి?

10)రామాయణంలో మొత్తము శ్లోకాలు ఎన్ని?

11)దశరథుడు పుత్రప్రాప్తి కోసం ఋష్యశృంగునితో చేయించిన యాగం పేరేమి?

12)రాముడు ఏ బాణప్రయోగం ద్వారా తాటకి ని సంహరించాడు?

13) అహల్య ఎవరి శాపానికి గురైంది?

14) జటాయువు సోదరుని పేరు?

15)ఆంజనేయుని వాహనం ఏమిటి?

16) సీతాదేవి తల్లి తండ్రులెవరు?

17)సుగ్రీవుని మంత్రి ఎవరు?

18)సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?

19)భరత, శత్రఘ్నుల భార్యలు ఎవరూ?

20) జనకుడి తమ్ముని పేరు ఏమిటి?

21)రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని కైకేయికి దుర్భోధ చేసింది ఎవరు?

22) సీత రాములు నివసించిన పర్ణశాల ఉన్న ప్రదేశం పేరు ఏమిటి?

23)వాలి ,సుగ్రీవుని కథను రాముడికి వివరించి, సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పింది ఎవరు?

24)కిష్కింధ రాజ్యానికి రాజు ఎవరు ?

25)విభీషణుని భార్య పేరేమి?

26)కుంభకర్ణుడిని శ్రీ రాముడు ఏ అస్త్రంతో వదించాడు?

27)ఇంద్రజిత్తున్ని చంపింది ఎవరు?

28)రాముడు ఏ బాణ ప్రయోగంతో రావణుడిని చంపాడు?

Answers
జవాబులు

1)కౌసల్య
2)ఇక్ష్వాకుల
3)బల, అతిబల
4)సుమిత్ర
5)సురస
6)మండోదరి
7)బ్రహ్మ
8)మారీచుడు
9)శివ ధనుస్సు
10)24వేలు
11)పుత్ర కామేష్టి
12)శబ్ద వేధి బాణప్రయోగం
13)గౌతమ మహర్షి
14)సంపాతి
15)ఒంటె
16)జనకుడు,సునయన
17)హనుమంతుడు
18)త్రిజట
19)మాండవి,శ్రుతకీర్తి
20)కుశధ్వజుడు
21)మంథర
22)పంచవటి
23)కబంధుడు
24)వాలి after his death (సుగ్రీవుడు)
25)సరమ
26)ఐoదాస్త్రామ్
27)లక్మణుడు
28)బ్రహ్మాస్త్రం

Advertisement
Related posts
కార్య ప్రారంభ ప్రార్థనలు
కార్య ప్రారంభ ప్రార్థనలు

ప్రారంభ ప్రార్థనలు నూతన కార్యములు / పనులు ప్రారంభించే ముందు చేయు ప్రార్థనలు మన హిందూ సాంప్రదాయం లో నూతన కార్యములు , పనులు ప్రారంభించే ముందు Read more

Leave A Reply

Please enter your comment!
Please enter your name here